ఇంజినీరింగ్ లేదా డిగ్రీ చివరి ఏడాదిలో ఉన్న ప్రతి విద్యార్థికి ఒకే ఒక్క టెన్షన్ – జాబ్ ఎలా కొట్టాలి ? కానీ ఈ సమయంలో చాలా మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ గురించి కొన్ని తప్పు అభిప్రాయాలు కలిగి ఉంటారు. అవి ఏంటో చూద్దాము.
ఈ misconceptions వలన చాలామంది మంచి అవకాశాలను కోల్పోతుంటారు. ఇప్పుడు ఆ డౌట్స్‌ను క్లియర్ చేద్దాం!
1: క్యాంపస్‌లోనే జాబ్ వస్తుంది
చాలా మంది అనుకుంటారు – “మన కాలేజీలో కంపెనీ రాలేదంటే జాబ్ రానట్టే ” అన్నట్టు. కానీ ఇది నిజం కాదు.
👉 వాస్తవం: క్యాంపస్ ప్లేస్‌మెంట్‌కి వచ్చే కంపెనీలు లిమిటెడ్గానే ఉంటాయి. కానీ ఆఫ్-క్యాంపస్ (బయటగా అప్లై చేసే విధానం) ద్వారా చాలా మంచి కంపెనీలు హైర్ చేస్తాయి. మంచి స్కిల్స్ ఉంటే ఇంకా బెస్ట్ ఆఫర్స్ రావచ్చు.
2: నాలుగవ ఏడాదిలో ప్రేపరషన్ స్టార్ట్ చేస్తే లేట్ అయిపోతుంది
సీనియర్లు చాలా మంది చెప్పే మాట: “సెకండ్ ఇయర్ నుంచే ప్రిపేర్ కావాలి” – అది నిజమే . కానీ నాలుగవ సంవత్సరం నుంచే స్టార్ట్ చేస్తే జాబ్ రాదన్నది అర్థరహితమైన మాట.
👉 వాస్తవం: డెడికేషన్‌తో ప్లాన్ చేసి, రోజుకు 4-5 గంటలు ప్రాక్టీస్ చేస్తే – 4th ఇయర్‌లోనూ మంచి జాబ్ రావచ్చు.
🎯 DSA, Mock Interviews, Resume Building మొదలైనవి ఇప్పుడే స్టార్ట్ చేయండి.
3: మన కాలేజ్ 100% ప్లేస్‌మెంట్స్ ఇస్తుందట
కొన్ని కాలేజీలు brochures లో “100% placement guarantee” అని రాస్తాయి. కానీ ఇది హైప్ మాత్రమే.
👉 వాస్తవం: ప్లేస్మెంట్ లో జాబ్ వచ్చేనా , రాద అన్నది మీ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాలేజ్ ఒక ఫ్లాట్‌ఫాం మాత్రమే – గ్యారెంటీ ఇవ్వదు.
🎯 ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వాలి, కాలేజ్ మీద పూర్తిగా ఆధారపడకండి.
4: Google, Amazon లాంటి కంపెనీలు Tier-1 కాలేజీల నుంచే తీసుకుంటాయి
చాలామంది Tier-2 / Tier-3 కాలేజీ స్టూడెంట్స్ లో ఇది నమ్మకం – “మన కాలేజ్ నుంచి ఆ కంపెనీలు ఎప్పుడు చూస్తాయ్?”
👉 వాస్తవం: MAANG (Meta, Amazon, Apple, Netflix, Google) కంపెనీలు స్కిల్స్ చూస్తాయి – కాలేజ్ పేరు కాదు. ఆఫ్ క్యాంపస్, హాకథాన్లు, GitHub, Open Source వర్క్ లాంటివి మీ ప్రొఫైల్ బలంగా చూపిస్తాయి.
🎯 Leetcode, GitHub, LinkedIn presence మెయింటెయిన్ చేయండి.
5: ఈ ఇంటర్వ్యూ మిస్ అయితే, తర్వాత ఉంటుంది కదా
ఇంటర్వ్యూ వస్తే సరిగా ప్రిపేర్ కాక, లేదా “ఇప్పుడు attend కాకపోయినా పర్లేదు” అని అనుకోవటం తప్పు.
👉 వాస్తవం: ఒక్కో ఇంటర్వ్యూ ఒక్కో అవకాశం. ఒక్కసారి మిస్ అయితే, ఆ కంపెనీ ఇంకెప్పుడూ రావకపోవచ్చు.
🎯 అదే మీ dream job కాకపోయినా, every interview attend కావాలి – confidence & experience two-in-one.
ప్లేస్‌మెంట్స్ అనేది స్ట్రాటజీ + స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అనేది ఒక golden opportunity. కానీ ఒకసారి miss చేస్తే అంతే అని భయపడకండి. అన్నిటికంటే ముఖ్యమైనవి:
- మీ preparation
- మీ attitude
- మీ continuous learning