SQL Query To CREATE Table

How to Create Table in SQL

Introduction

ఈ ట్యుటోరియల్ ద్వారా మీరు Database లో SQL ఉపయోగించి tables ఎలా create చేయాలో నేర్చుకుంటారు. మనం CREATE TABLE command ని ఉపయోగించి ఒక కొత్త Table ని database లో create చేస్తాము.

RDBMS(Database) లో, tables అనేవి structure లో data ని store చేయడానికి ఉపయోగిస్తారు. Fields అనేవి columns లాంటివి – ఇవి ఏ రకమైన data store చేయాలో చెబుతాయి. Records అనేవి rows – actual data store అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే, Table అనేది rows మరియు columns కలయిక.

SQL మనకు data తో సులభంగా interaction చేయడానికి చాలా commands ఇవ్వడం జరుగుతుంది. Tables create చేయడం, delete చేయడం, data insert/update/delete చేయడం అన్నీ SQL statements తో చేయవచ్చు.

SQL CREATE TABLE Statement

SQL లో CREATE TABLE statement ద్వారా ఒక కొత్త table create చేయవచ్చు. ఈ query లో table structure ని clearly define చేయాలి:

  • Table name
  • Columns పేర్లు
  • ప్రతి column కు data type

ఒక database లో ప్రతి table కి unique name ఉండాలి.

Syntax :-

SQL
CREATE TABLE table_name(
   column1 datatype,
   column2 datatype,
   column3 datatype,
   .....
   columnN datatype,
   PRIMARY KEY( one or more columns )
);

Explanation:

  • CREATE TABLE → table create చేయాలనుకుంటున్నమని database system కి చెప్తుంది
  • table_name → మీరు create చేయాలనుకునే table కి unique name
  • column definitions → column names మరియు వాటి data types
  • PRIMARY KEY → ప్రతి record కి unique identity ఇవ్వడం కోసం

Example

SQL
CREATE TABLE CUSTOMERS(
   ID          INT NOT NULL,
   NAME        VARCHAR(20) NOT NULL,
   AGE         INT NOT NULL,
   ADDRESS     CHAR(25),
   SALARY      DECIMAL(18, 2),
   PRIMARY KEY (ID)
);

Key Points:

  • ID, NAME, AGE, ADDRESS, SALARY అనే columns create చేసాం
  • ID column primary key గా define చేసాం
  • NOT NULL constraint వల్ల కొలమ్ ఖాళీగా ఉండకూడదు

Table Structure Verification:

Table create అయిన తర్వాత structure ని verify చేయాలంటే:

SQL
DESC CUSTOMERS;

ఇది CUSTOMERS అనే table యొక్క columns, వాటి data types, NULL/NOT NULL constraints ను చూపుతుంది.

Output Format:

FieldTypeNullKeyDefaultExtra
IDint(11)NOPRINULL
NAMEvarchar(20)NONULL
AGEint(11)NONULL
ADDRESSchar(25)YESNULL
SALARYdecimal(18,2)YESNULL

ఈ విధంగా CUSTOMERS table ని మన database లో successfully create చేయవచ్చు.

CREATE TABLE IF NOT EXISTS

మీరు create చేయాలనుకుంటున్న table ముందు నుండే database లో ఉన్నప్పుడు error వస్తుంది:

ERROR 1050 (42S01): Table 'CUSTOMERS' already exists

ఈ error ని avoid చేయడానికి CREATE TABLE IF NOT EXISTS ఉపయోగించవచ్చు:

Syntax:

SQL
CREATE TABLE IF NOT EXISTS table_name(
   column1 datatype,
   column2 datatype,
   column3 datatype,
   .....
   columnN datatype,
   PRIMARY KEY( one or more columns )
);

Example:

SQL
CREATE TABLE IF NOT EXISTS CUSTOMERS(
   ID          INT NOT NULL,
   NAME        VARCHAR (20) NOT NULL,
   AGE         INT NOT NULL,
   ADDRESS     CHAR (25),
   SALARY      DECIMAL (18, 2),
   PRIMARY KEY (ID)
);

ఈ command CUSTOMERS అనే table ముందుగా లేనప్పుడు మాత్రమే create చేస్తుంది. లేదంటే ఏమీ చేయదు – error రాదు.

Creating a Table from an Existing Table

ఒక existing table structure మరియు data ని తీసుకుని కొత్త table create చేయొచ్చు. ఈ process లో CREATE TABLE మరియు SELECT statements combination ఉపయోగిస్తాము.

Syntax:

SQL
CREATE TABLE NEW_TABLE_NAME AS
SELECT [column1, column2...columnN]
FROM EXISTING_TABLE_NAME
WHERE Condition;

Example:

SQL
CREATE TABLE SALARY AS
SELECT ID, SALARY
FROM CUSTOMERS;

ఈ command ద్వారా SALARY అనే కొత్త table create అవుతుంది, దీనిలో CUSTOMERS table నుండి ID మరియు SALARY columns data మాత్రమే ఉంటుంది.

Output Structure:

FieldTypeNullKeyDefaultExtra
IDint(11)NOPRINULL
SALARYdecimal(18,2)YESNULL

Practice Tasks:

  1. EMPLOYEES అనే table create చేయండి (ID, NAME, DEPARTMENT, SALARY columns తో)
  2. IF NOT EXISTS వాడండి
  3. CUSTOMERS నుండి ID, NAME ని తీసుకుని CUSTOMER_NAMES అనే కొత్త table తయారు చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *