క్యాంపస్ సెలెక్షన్ అనేది విద్యార్థుల జీవితంలో turning point లాంటిది. ఈ ప్రక్రియ సాధారణంగా B.Tech, Degree, MBA చదివే విద్యార్థులకు, వారు చదువుతున్న కాలేజీలకే కంపెనీలు వచ్చి వారికి ఉద్యోగ అవకాశం ఇవ్వడం. ఈ అవకాశాన్ని సంపాదించడానికి నీవు ఎలా సిద్ధం కావాలి, ఏ దశలు ఉంటాయో చూద్దాం.
1.1 కంపెనీ కాలేజీకి రావడం ఎలా జరుగుతుంది?
Placement Cell ద్వారా – ప్రతి కాలేజీకి ఒక placement cell (training & placement department) ఉంటుంది. ఇది కంపెనీలతో సంబంధాలు ఏర్పర్చి, వాళ్లను కాలేజీకి రప్పిస్తుంది.
కంపెనీలు తమ అవసరాలు అనుగుణంగా , JD (Job Description), eligibility criteria (like 60% above, no backlogs) ముందుగా చెబుతాయి.
1.2 క్యాంపస్ సెలెక్షన్ ప్రక్రియ ఎలా ఉంటుంది?
Step 1: Pre-placement Talk (PPT)
కంపెనీ గురించి వివరాలు, రోల్, salary, growth opportunities గురించి సమాచారం ఇస్తారు.
Step 2: Written Test / Online Assessment
Aptitude Test: Maths, Reasoning, English
Technical Test: C, Java, Data Structures, Basics of Programming
Step 3: Group Discussion (GD)
ఇది soft skills, communication, team coordination స్కిల్స్ చూస్తారు..
Step 4: Technical Interview
సబ్జెక్ట్ మీద Skill, project work గురించి అడుగుతారు. Coding problems ఎలా solve చేస్తావో చూస్తారు .
Step 5: HR Interview
About yourself
Why this company?
Strengths, weaknesses
Salary expectations, relocation readiness
1.3 కంపెనీ సెలెక్ట్ చేసే విధానం?
Written + Technical + HR performance
Communication skills
Attitude, confidence, approach
1.4 కొన్ని ముఖ్యమైన సూచనలు:
ఎప్పుడు Resume update చేసి, clean గా ఉంచాలి.
Mock interviews, group discussions చేయాలి.
Body language మీద పనిచేయాలి.
Company background తెలుసుకోవాలి.